IT Returns: రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నులు.. 53లక్షల మంది తొలిసారి దాఖలు

Income Tax Returns filing: గత ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఆదాయపు పన్ను రిటర్నులు 6.77 కోట్లు దాటినట్టు ఐటీశాఖ వెల్లడించింది. 

Published : 01 Aug 2023 21:09 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు జులై 31తో గడువు ముగిసింది. 2023-24 మదింపు సంవత్సరానికి రికార్డుస్థాయిలో ఐటీ రిటర్నులు దాఖలైనట్టు ఐటీశాఖ వెల్లడించింది. జులై 31వరకు మొత్తంగా 6.77 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలైనట్టు ఐటీశాఖ తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 16.1శాతం కన్నా అధికమని ఐటీ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరిలో 53.67లక్షల మంది తొలిసారి ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు తెలిపింది.

ఐటీఆర్‌ డెడ్‌లైన్‌ మిస్‌ అయ్యారా? ఇప్పటికీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయొచ్చు..

గతేడాది  (2022-23) జులై 31 నాటికి 5.83 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు చేయగా ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. రిటర్నుల ఫైలింగ్‌కు జులై 31 (సోమవారం) ఆఖరు తేదీ కావడంతో నిన్న ఒక్కరోజే 64.33లక్షల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ- ఫైలింగ్‌ పోర్టల్‌కు జులై 31వరకు మొత్తంగా 32 కోట్ల మంది లాగిన్‌ కాగా..  ఒక్క ఆఖరి రోజునే 2.74 కోట్ల మంది విజయవంతంగా లాగిన్‌ అయినట్టు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని