Jio Disney Plus Hotstar: జియో కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలు ఉచితం

జియో కంపెనీ మరో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్లను ప్రకటించింది. వీటితో రీఛార్జ్‌ చేసుకుంటే యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో చూద్దాం. 

Published : 23 Feb 2022 23:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ జియో సంస్థ వినియోగదారుల కోసం మరో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్లను ప్రకటించింది. రూ. 1,499, రూ. 4,199తో రీఛార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు రూ. 1,499 విలువ కలిగిన డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో జియో యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌లోని 4K క్వాలిటీ కంటెంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ రీఛార్జ్ ప్లాన్‌తో హై-స్పీడ్‌ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజువారీ ఎస్సెమ్మెస్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

* రూ. 1,499 విలువైన రీఛార్జ్‌ కాలపరిమితి 84 రోజులు. ఇందులో ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లు పొందుతారు. 

* రూ. 4,999 రీఛార్జ్ కాలపరిమితి 365 రోజులు. ఈ రీఛార్జ్‌తో యూజర్‌క ప్రతి రోజూ 3జీబీ హై-స్పీడ్‌ డేటాతోపాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం లభిస్తుంది. వీటితోపాటు రెండు రీఛార్జ్‌ ప్లాన్లలో అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌  ఉచితంగా పొందవచ్చు. * జియో యూజర్స్‌ మై జియో యాప్‌ నుంచి రీఛార్జ్‌ చేసుకోవచ్చు. కొత్త ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న తర్వాత మై జియో యాప్‌లో యూజర్‌కు డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం ప్రత్యేక కూపన్‌ కోడ్ వస్తుంది. తర్వాత హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌ వెబ్‌పేజ్‌లో కూపన్‌ కోడ్ ఎంటర్‌ చేసి యూజర్‌ ఫోన్‌ నంబరుతో సైన్‌ ఇన్‌ చేస్తే ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. దీంతో యూజర్‌ ఏడాదిపాటు 4K క్వాలిటీ కంటెంట్‌ను మొబైల్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లెట్స్‌, టీవీలలో ఏదైనా నాలుగు డివైజ్‌లలో ఒకేసారి చూడొచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో లైవ్‌ స్పోర్ట్స్‌, హాట్‌స్టార్‌ స్పెషల్స్‌, టీవీ సీరియల్స్‌, సినిమాలు, డిస్నీ+ సినిమాలు, డిస్నీ+ ఒరిజినల్స్‌ కంటెంట్‌ను వీక్షించవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని