Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. చమురు సంస్థలు రూ.50 మేర పెంచాయి.

Published : 06 Jul 2022 08:46 IST

హైదరాబాద్‌: గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. చమురు సంస్థలు రూ.50 మేర పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్‌ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది.

సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్‌ ధరను పెంచాయి. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని