పేటీఎం మ‌నీతో మ్యూచువ‌ల్ ఫండ్లు ప్రారంభించండి

పేటీఎం మ‌నీతో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుదారులు రెట్టింపు అవుతార‌ని కంపెనీ భావిస్తోంది.....

Published : 19 Dec 2020 17:04 IST

పేటీఎం మ‌నీతో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుదారులు రెట్టింపు అవుతార‌ని కంపెనీ భావిస్తోంది​​​​​​​.

పేటీఎం మ‌నీ లిమిటెడ్‌తో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుదారులు దేశంలో రెట్టింపు అవుతార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం 20 మిలియ‌న్ల పెట్టుబ‌డుదారులుండగా, పేటీఎం మ‌నీ ద్వారా సుల‌భంగా పెట్టుబడులు ప్రారంభించేందుకు అవ‌కాశం ఉండ‌టంతో 2023 నాటికి 50 మిలియ‌న్ల‌కు చేరుతార‌ని అంచ‌నా వేస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో పేటీఎం మ‌నీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని సుల‌భంగా పెట్టుబ‌డులను ప్రారంభించ‌వ‌చ్చు. మొద‌ట ఇది 25 మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు అందించే అన్ని స్కీములు, డైరెక్ట్ ప్లాన్ల‌ను అందించ‌నుంది. ఇవి మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ ఆస్తుల మొత్తంలో 90 శాతం విలువ క‌లిగి ఉన్నాయి. అతి త్వ‌ర‌లో మిగ‌తా అన్ని సంస్థ‌ల స్కీమ్‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని పేటీఎం మ‌నీ డైరెక్ట‌ర్‌ ప్ర‌వీణ్ జాద‌వ్ అన్నారు. పేటీఎం మ‌నీ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ కంటే వేగంగా వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని, చిన్న ప‌ట్ట‌ణాల‌కు కూడా వేగంగా విస్త‌రిస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. పేటిఎం మ‌నీ ముంద‌స్తు ప్ర‌వేశాల కోసం నమోదు చేసుకునే అవ‌కాశం క‌ల్పించగా, ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదు చేసుకున్న‌వారిలో 65 శాతం చిన్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి ఉన్న వినియోగదారులేన‌ని వెల్ల‌డించింది.

పేటీఎం మ‌నీ అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ల డైరెక్ట్ ప్లాన్ల‌ను విక్ర‌యించ‌నుంది. ఇవి త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. ఇందులో డిస్ర్టీబ్యూట‌ర్ క‌మీష‌న్లు ఉండ‌వు. ఎవ‌రైతే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో నేరుగా పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నారో వారికి పేటీఎం మ‌నీ యాప్ స‌రైన ఆప్ష‌న్. సెబీ కూడా పేటీఎం మ‌నీ ద్వారా కేవ‌లం డైరెక్ట్ ప్లాన్ల‌ను విక్ర‌యించేందుకు ఆమోదం తెలిపింది.

పెట్టుబ‌డుదారులు కేవైసీ పూర్తి చేసి, రిస్క్ ప్రొఫైల్స్‌ను సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీంతో ఏదైనా స్కీమ్ కొనుగోలు చేసేముందు అవి డిస్‌ప్లే అవుతాయి. ప్ర‌స్తుతం పేటీఎం మ్యూచువ‌ల్ ఫండ్లు అమ్మ‌కాల‌కు, కొనుగోళ్ల‌ను నిర్వ‌హించ‌నుంది. మ‌రిన్ని రోర‌జులో ఇన్వెస్ట్‌మెంట్ ప్యాక్స్‌ను ప్రారంభించ‌నుంది. దీంతో చాలా ర‌కాల స్కీమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మొద‌టిసారి పెట్టుబ‌డులు చేసేవారు త‌క్కువ నుంచి మ‌ధ్య‌స్థాయి రిస్క్ ఉన్న స్కీముల‌ను ఎంచుకుంటే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని