stock market: భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు ..! 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405

Updated : 22 Jul 2021 09:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌  52,604 వద్ద కొనసాగుతున్నాయి. ఐడీసీఎల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, అల్కార్గో లాజిస్టిక్స్‌, జుబ్లియంట్‌ ఫుడ్‌ వర్క్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ షేర్ల విలువ పెరగ్గా.. పోలికాబ్‌ ఇండియా, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పవర్‌, లక్ష్మీ మిషిన్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ షేర్ల ధరలు కుంగాయి. 

నేడు మొత్తం 44 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో హిందూస్థాన్‌ యూనిలీవర్‌,బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌ సిమెంట్‌,బయోకాన్‌,హిందూస్థాన్‌ జింక్‌,ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌,ఇండియా మార్ట్‌, ఇంటర్మెష్‌ కంపెనీలు ఉన్నాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.28పైసలు తగ్గి రూ.74.76 వద్ద ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని