Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఈఓ రాజీనామా

Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ సురీందర్‌ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. 

Updated : 09 Apr 2024 22:12 IST

Paytm | దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ సురీందర్‌ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పాటు మెరుగైన కెరీర్‌ అవకాశాలను అన్వేషించడంలో భాగంగానే ఆయన తన పదవి నుంచి వైదొలిగినట్లు పేటీఎం (Paytm) మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ధ్రువీకరించింది. ఏప్రిల్‌ 8న రాజీనామా సమర్పించారని బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 

గతేడాది జనవరిలో పీపీబీఎల్‌ ఎండీ, సీఈఓగా సురీందర్‌ చావ్లా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చావ్లా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీబీఎల్‌పై RBI ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆదేశించింది. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయొద్దని తెలిపింది. తర్వాత ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పార్ట్‌ టైమ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి విజయ్‌ శేఖర్‌ శర్మ వైదొలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని