Petrol, Diesel Price: కొనసాగిన పెట్రో ధరల వడ్డన.. ఇవాళ ఎంత పెరిగాయంటే?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచాయి. తెలంగాణలో పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో

Published : 06 Apr 2022 09:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచాయి. తెలంగాణలో పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.40, డీజిల్‌ 105.49కి చేరింది. ఏపీలో పెట్రోల్‌పై 87పైసలు, డీజిల్‌పై 83పైసలు పెంచడంతో గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.121.26, డీజిల్‌ రూ.106.87, విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.121.06, డీజిల్‌ రూ.106.67కు చేరింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని