ఖాతాల కోసం ఇక వీడియో కేవైసీ

నాలుగు దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకులు అయిన కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఆర్‌బీఎల్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు కరోనా వైరస్ కారణంగా తలెత్తిన లాక్ డౌన్ లో తమ పొదుపు ఖాతా బేస్ ను పెంచుకోవడానికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా, వీడియో కేవైసీని ఉపయోగించడం ప్రారంభించాయి...

Updated : 01 Jan 2021 19:51 IST

నాలుగు దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకులు అయిన కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఆర్‌బీఎల్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు కరోనా వైరస్ కారణంగా తలెత్తిన లాక్ డౌన్ లో తమ పొదుపు ఖాతా బేస్ ను పెంచుకోవడానికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా, వీడియో కేవైసీని ఉపయోగించడం ప్రారంభించాయి.

ఆర్బీఐ వీడియో-కేవైసీని అనుమతించడానికి ముందు, రుణదాతలు కొన్ని ఖాతాలను డిజిటల్‌ పద్దతిలో తెరిచారు, కానీ వారు కేవైసీని 12 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. కేవైసీ భౌతికమైనది, అది పూర్తయ్యే వరకు, ఒక కస్టమర్ రూ. 1 లక్షలకు మించి బ్యాలెన్స్ ను కలిగి ఉండలేడని ఆర్బీఎల్ బ్యాంకు రిటైల్ లయబిలిటీస్, వెల్త్ మ్యానేజ్మెంట్ హెడ్ సురీందర్ చావ్లా తెలిపారు.

ఉదాహరణకు, కోటక్ మహీంద్రా బ్యాంకు తన కోటక్ 811 డిజిటల్ పొదుపు ఖాతా కోసం వీడియో-కేవైసీని ప్రారంభించింది. పైలట్ ప్రాతిపదికన ప్రారంభించిన ఈ సదుపాయం ఇతర ఉత్పత్తులకు కూడా విస్తరించాలని భావిస్తున్నామని కోటక్ మహీంద్రా బ్యాంకు, కన్స్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం తెలిపారు. కోవిడ్ -19 ప్యాండమిక్ తరువాత బ్యాంకులు, కస్టమర్లు కొత్త విధానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మే 1 నుంచి 12 మధ్య బ్యాంకు ప్రతి రోజూ 14,000 కోటక్ 811 ఖాతాలను తెరిచిందని, ఎఫ్‌వై 20 లో సుమారు 4.4 మిలియన్ల ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాంతి ఏకాంబరం తెలిపారు.

ప్రస్తుతం డిపాజిట్లు చేయడానికి బ్యాంకు శాఖలపై ఎక్కువగా ఆధారపడిన వినియోగదారులు, కోవిడ్ -19 తరువాత కొత్త విధానాలను ఎడాప్ట్ చేసుకోవడం ద్వారా బ్యాంకు శాఖలను సందర్శించరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమ సజావుగా ఆన్‌బోర్డ్‌లోకి వెళ్లడానికి, తమ వినియోగదారులకు సేవలను అందించడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, టెక్నాలజీ సొల్యూషన్స్ రెండూ కలిసి అభివృద్ధి చెందుతున్నాయని, దానికి వీడియో కేవైసీ ఎనేబుల్మెంట్, అడాప్షన్ ఒక ఉదాహరణ అని పీడబ్ల్యుసీ భాగస్వామి, ఫిన్‌టెక్ లీడర్ వివేక్ బెల్గావి తెలిపారు. అలాగే అన్ని సంస్థలకు కస్టమర్ ఆన్‌బోర్డింగ్, సర్వీసింగ్‌పై పునఃపరిశీలన అవసరమని బెల్గావి తెలిపారు.

4 శాతం లేదా అంతకంటే తక్కువ వడ్డీ రేటుతో వచ్చే తాజా డిపాజిట్లను పొందడం ద్వారా రుణదాతలు ప్రయోజనం పొందుతారు. భారతదేశంలోని బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని నిర్వహించడానికి డిపాజిట్ల ప్రవాహంపై ఎక్కువగా ఆధారపడతాయి. మే 7న ఆర్బీఎల్ బ్యాంకు విశ్లేషకులకు వెల్లడించిన ప్రకారం, ప్రస్తుతం బ్యాంకు రోజుకు 500 పొదుపు ఖాతాలను డిజిటల్‌గా సంపాదిస్తుందని, రాబోయే మూడు నెలల్లో దీనిని రోజుకు 1,000 కి పెంచాలని ఆశిస్తోంది. ఇప్పుడు దాని డిజిటల్-సోర్స్ డిపాజిట్లు దాని రిటైల్ డిపాజిట్లలో 65 శాతంగా ఉన్నాయి.

జీరో-కాంటాక్ట్ పద్ధతి పేపర్ వర్క్, బయోమెట్రిక్ ధృవీకరణకు దూరంగా ఉంటుంది, వీడియో కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు ఒకరిని ఒకరు కలుసుకునే అవకాశం కూడా ఉండదని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు రిటైల్ లయబిలిటీస్ హెడ్ అమిత్ కుమార్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని