Updated : 30 Jul 2022 16:21 IST

2 వేల నామినేషన్లు.. తెలంగాణ నుంచి ఇద్దరికి ట్యాలీ పురస్కారాలు (ప్రకటన)

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల సంస్థ ట్యాలీ.. ఎంఎస్‌ఎంఈ పురస్కార విజేతలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దక్షిణాది జోన్‌లో ఐదు కేటగిరీలకు గానూ రెండు కేటగిరీల్లో వీరికి పురస్కారాలు దక్కాయి. వరంగల్‌కు చెందిన శ్రీనివాస ఏజెన్సీ అధినేత యాడా శ్రీనివాస్‌, హైదరాబాద్‌కు చెందిన గ్రేడియంట్‌ సైన్స్‌ యజమాని పవన్‌ త్రిపాఠికి ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల 27న ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాలీ ఈ అవార్డులను ప్రకటించింది.

ఏటా MSME Honours పేరిట.. ట్యాలీ ఈ అవార్డులను ప్రకటిస్తుంటుంది. ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌ జోన్లకు గానూ ఐదు కేటగిరీల్లో ఈ అవార్డులను అందజేస్తుంది. వండర్‌ ఉమన్‌, బిజినెస్‌ మ్యాస్ట్రో, నెక్ట్స్‌ జెన్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, ఛాంపియన్‌ ఆఫ్‌ కాజ్‌ కేటగిరీలకు దక్షిణాది నుంచి తెలంగాణకు చెందిన ఇద్దరు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

యాడా శ్రీనివాస్‌: ఛాంపియన్‌ ఆఫ్‌ కాజ్‌ కేటగిరీలో యాడా శ్రీనివాస్‌కు ఈ పురస్కారం దక్కింది. శ్రీనివాస్‌ ఏజెన్సీ గత పదేళ్లుగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పండగలు, ప్రత్యేక రోజుల్లో అవసరమైన వారికి ఆహారం పంపిణీ చేయడంతో పాటు ఛారిటీ సంస్థలకు నిత్యావసరాలను అందిస్తోంది. ఒక్క గతేడాదిలోనే 1500 మందికి ఈ ఏజెన్సీ ఆపన్నహస్తం అందించింది.


పవన్‌ త్రిపాఠి: సైంటిఫిక్‌ సర్వీస్‌ ఇండస్ట్రీ అయిన గ్రేడియంట్‌ సైన్స్‌ హైదరాబాద్‌ వేదికగా 2018లో ప్రారంభమైంది. ఫార్మా, బయో ఫార్మా, ఎలక్ట్రానిక్‌ అండ్‌ సెమి కండక్టర్స్‌ కంపెనీలకు తక్కువ ధరకే సింథసిస్‌ను అందిస్తుంటుంది. చిన్న చిన్న కంపెనీలు, సైంటిస్టుల సహకారంతో ఇదంతా చేయగలుగుతోంది. కేవలం మూడేళ్లలో వెయ్యికి పైగా కెమికల్‌ కాంపౌండ్స్‌ను తయారు సప్లయ్‌ చేయగలిగే సామర్థ్యాన్ని ఈ కంపెనీ అందుకుంది. దీంతో చైనా దిగుమతులపై ఆధారపడడం కొంతమేర తగ్గింది.


కేటగిరీలు ఇవీ..

  • వండర్‌ ఉమన్‌: అడ్డంకులను అధిగమించి నలుగురికీ స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళా వ్యాపారవేత్తలకు ఈ పురస్కారం అందజేస్తారు.
  • బిజినెస్‌ మ్యాస్ట్రో: వ్యాపారం నిరంతరం అభివృద్ధి చెందడానికి వీలుగా బలమైన పునాదులను నిర్మించిన వ్యాపార ప్రముఖులకు ఈ పురస్కారం ఇస్తారు.
  • నెక్ట్స్‌జన్‌ ఐకాన్‌: ఇప్పటికే ఉన్న పరిష్కారాలకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపించి మార్కెట్ అంతరాన్ని గుర్తించి పరిష్కరించిన వ్యాపార నాయకులకు ఈ పురస్కారంతో సత్కరిస్తారు. 
  • డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌: సరికొత్త డిజిటల్‌ టూల్స్‌ను, డిజిటల్‌ సొల్యూషన్స్‌ను అందిపుచ్చుకుని వ్యాపారంలో రాణిస్తున్న వ్యాపార వేత్తలకు ఈ పురస్కారం లభిస్తుంది.
  • ఛాంపియన్‌ ఆఫ్‌ కాజ్‌: తాము ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి సమాజానికి తన వంతు సేవ చేస్తున్న వ్యాపారులను ఈ పురస్కారం అందిస్తారు.

ఎంపిక ఇలా..

వరుసగా రెండో ఏడాది అందిస్తున్న ఈ పురస్కారాలకు అద్భుతమైన స్పందన లభించింది. అన్ని కేటగిరీలకు గానూ ప్రపంచవ్యాప్తంగా 2,000 నామినేషన్లు వచ్చాయి. ఇలా వచ్చిన నామినేషన్లు జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. నాలుగు జోన్లు, ఐదు కేటగిరీల్లో మొత్తం 97 మందిని ఎంపిక చేశారు. రూపా రాణి (ఫోరం ఆఫ్‌ విమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌ వ్యవస్థాపకులు, అధ్యక్షులు), వినోద్‌ అగర్వాల్‌ (సీఐఐ గుజరాత్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మాజీ ఛైర్మన్‌), నిరంజన్‌ జైన్‌ (ఎంఎస్‌ఎం & స్టార్టప్స్‌ ఫోరం ఛైర్మన్‌), ప్రవీణ్‌ ఖందేల్వాల్‌ (కాయిట్‌, నేషనల్‌ సెక్రటరీ జరల్‌) జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. మిగిలిన పురస్కార గ్రహీతల వివరాల కోసం https://tallysolutions.com/msme-honours వెబ్‌సైట్‌ను సందర్శించండి.Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని