హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు

గత ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో స్తబ్దుగా ఉన్న గృహ మార్కెట్‌లో ప్రస్తుతం

Published : 12 Jan 2021 11:19 IST

 ప్రాప్‌టైగర్‌ నివేదిక

హైదరాబాద్‌: గత ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో స్తబ్దుగా ఉన్న గృహ మార్కెట్‌లో ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని ప్రాప్‌టైగర్‌ నివేదిక వెల్లడించింది. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇది అధికంగా ఉందని తెలిపింది. విక్రయాలతో పాటు, నూతన ప్రారంభాలూ అక్టోబరు-డిసెంబరు 2020లో కనిపించాయని పేర్కొంది. దేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులలో ఈ మూడు నగరాల్లోనే 43 శాతం వరకు ఉన్నాయని, అమ్మకాల పరంగానూ 29శాతం వరకు ఇక్కడే కనిపించాయని తెలిపింది. మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ధరల్లో వృద్ధి కనిపిస్తోందని తెలిపింది. ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులే ఇందుకు కారణమని తెలిపింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో అత్యధిక ప్రాజెక్టులు హైదరాబాద్‌లోనే ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 12,723 నివాస గృహాల నిర్మాణం ప్రారంభం కాగా.. 6,487 ఇళ్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఆఫీసు కార్యకలాపాల పరంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో సరఫరా, గిరాకీ అధికంగా ఉంది. హైదరాబాద్‌లో ఏడాదిలో 5 శాతం వరకు ధరలు పెరిగాయని పేర్కొంది.

ఇవీ చదవండి...

తినడానికి సిద్ధంగా మాంసాహారం

ఆహారాన్ని వడ్డించే రోబోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని