Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 700+

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు.. దేశీయంగా దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సూచీలు కళకళలాడుతున్నాయి.

Updated : 27 Jun 2022 09:53 IST

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు.. దేశీయంగా దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సూచీలు కళకళలాడుతున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా.. నిఫ్టీ కూడా 15,900 పాయింట్ల పైన కదలాడుతోంది. ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 730.78 పాయింట్లు ఎగబాకి 53,458.19 వద్ద, నిఫ్టీ 218.3 పాయింట్ల లాభంతో 15,917.90 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు రాణిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ మిడ్ క్యాప్‌ సూచీలు ఒక శాతానికి పైగా లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పెరిగి 78.27 వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని