‘ఆఫీసుకు రాకుంటే చర్యలు’.. ఉద్యోగులకు TCS ఆఖరి ఛాన్స్‌!

TCS on work frome office: మార్చి చివరి నాటికి ఉద్యోగులంతా కార్యాలయాలకు చేరుకోవాలని టీసీఎస్‌ తమ ఉద్యోగులకు సూచించింది. గడువులోగా రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Updated : 07 Feb 2024 20:05 IST

TCS to staff: ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీసు కోసం ఉద్యోగులకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి నెలాఖరుకల్లా కార్యాలయాలకు రావాలని తాజాగా డెడ్‌లైన్‌ను విధించింది. ఇదే చివరి అవకాశం అని పేర్కొంది. ఒకవేళ రాకుంటే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది.

వర్క్‌ఫ్రమ్‌ ఆఫీసు గురించి కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్జీ సుబ్రహ్మణ్యం ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ... చివరి డెడ్‌లైన్‌ గురించి ఉద్యోగులకు తెలియజేసినట్లు చెప్పారు. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడం వెనక భద్రతా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ వల్ల అటు ఉద్యోగులకు, ఇటు సంస్థకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో వీటిని అడ్డుకునే వీలుండదని తెలిపారు.

వంటింట ధరల మంట: శాకాహార భోజన ఖర్చు పైకి.. మాంసాహారం కిందికి!

ఇటీవల త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన ఇన్ఫోసిస్‌.. తమ అమెరికా యూనిట్‌లో ఓ సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన ఘటన జరిగినట్లు వెల్లడించింది. డిసెంబర్‌ నెలలో తాము ర్యాన్సమ్‌వేర్‌ దాడిని ఎదుర్కొన్నట్లు హెచ్‌సీఎల్‌ తెలిపింది. అయితే, దానివల్ల కంపెనీకి ఎలాంటి నష్టమూ జరగలేదని పేర్కొంది. ఈనేపథ్యంలో సైబర్‌ దాడులపై టీసీఎస్‌ ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రస్తుతం 65 శాతం మంది ఉద్యోగులకు వారానికి మూడు రోజుల చొప్పున కార్యాలయాలకు వస్తున్నారని సుబ్రహ్మణ్యం చెప్పారు. కొవిడ్‌కు పూర్వం ఉన్న పని విధానాన్ని తీసుకురావాలని టీసీఎస్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని