Twitter: అద్దె చెల్లించని ట్విటర్.. కోర్టులో యజమాని దావా
Twitter: ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ట్విటర్ సకాలంలో అద్దె చెల్లించలేకపోతోంది. శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి డిసెంబరు, జనవరి నెల అద్దె చెల్లించడంలో విఫలమైంది.
శాన్‌ఫ్రాన్సిస్కో: బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలో క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటున్న ట్విటర్ (Twitter) ఆర్థిక కష్టాలతో సతమతమవుతోంది. చివరకు అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ (Twitter) ప్రధాన కార్యాలయానికి సంబంధించిన అద్దెను చెల్లించడంలో తాజాగా విఫలమైంది.
శాన్‌ఫ్రాన్సిస్కో 1355 మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ పెద్ద భవనంలో ట్విటర్ (Twitter) 4,60,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీనికి డిసెంబరు నెలకుగానూ 3.36 మిలియన్ డాలర్లు, జనవరి నెలకు 3.42 మిలియన్ డాలర్ల అద్దె చెల్లించాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ చెల్లించకపోవడంతో భవన యజమాని ‘శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ ఎల్‌ఎల్‌సీ’ కోర్టును ఆశ్రయించింది. కాలిఫోర్నియా స్టేట్ కోర్టులో సోమవారం దావా వేసింది.
కార్యాలయాన్ని అద్దెకు ఇస్తున్న సమయంలో ట్విటర్ నుంచి శ్రీ నైన్ మార్కెట్ 3.6 మిలియన్ డాలర్ల ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ను పూచీకత్తుగా తీసుకుంది. ఒకవేళ యాజమాన్య బదిలీ జరిగితే దాన్ని 10 మిలియన్ డాలర్లకు పెంచాలని అద్దె ఒప్పందంలో పేర్కొన్నట్లు శ్రీ నైన్ తమ దావాలో తెలిపింది. తాజాగా ట్విటర్ (Twitter) అద్దె చెల్లించకపోవడంతో లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా డిసెంబరు నెల పూర్తి అద్దెతో పాటు జనవరి నెలకు సంబంధించిన బకాయిలో కొంత భాగాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నట్లు తెలిపింది. మిగిలిన అద్దె చెల్లించేలా ట్విటర్ (Twitter)కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అలాగే లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను సైతం 10 మిలియన్ డాలర్లకు పెంచేలా ఆదేశించాలని కోరింది.
ట్విటర్ (Twitter)ను సొంతం చేసుకున్న దగ్గరి నుంచి ఎలాన్ మస్క్ (Elon Musk) వ్యయ నియంత్రణపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగా సగానికి పైగా ఉద్యోగులను తొలగించారు. ట్విటర్ (Twitter) ప్లాట్‌ఫారమ్‌లోనూ అనేక మార్పులు చేస్తున్నారు. పెయిడ్ వెర్షన్‌ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇతర దేశాల్లోని కార్యాలయాల అద్దెలను చెల్లించడానికి కూడా నిరాకరిస్తున్నారు. గత బకాయిలను చెల్లించడానికీ అంగీకరించడం లేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: రంగంలోకి పెన్స్.. ట్రంప్‌తో పోటీకి సై..!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. తండ్రీకుమారుడికి బెయిల్ మంజూరు
-
Movies News
varun tej: మెగా ఇంట పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ నిశ్చితార్థంపై ప్రకటన!
-
Politics News
Opposition Meet: ‘450 స్థానాల్లో భాజపాపై ఒక్కరే పోటీ’.. విపక్షాల వ్యూహం ఇదేనా..?
-
Movies News
Yash: మరో రామాయణం సిద్ధం.. రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్..!
-
Sports News
WTC Final: తొలి క్రికెటర్‌గా ట్రావిస్ హెడ్ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!