
వాళ్లు దేశాన్ని అమ్మేస్తున్నారు: మమతా
కోల్‌కతా: కేంద్రప్రభుత్వం దేశంలోని వనరుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆమె తీవ్ర విమర్శలు కురిపించారు. ‘భాజపా దేశభక్తి గురించి మాట్లాడుతుంది. కానీ దేశ వనరులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తోంది. ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్సూరెన్స్, రైల్వే ఇలా అన్నింటినీ అమ్మేస్తున్నారు. ఈ బడ్జెట్ పేద తరగతి ప్రజల్ని మోసం చేసే విధంగా ఉంది. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్’ అని మమతా విమర్శలు చేశారు. కొవిడ్ సమయంలో వలస కార్మికుల్ని ఇళ్లకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు.. కానీ వారి పార్టీలోకి వలస వచ్చే అవినీతి నాయకుల్ని దిల్లీ రప్పించేందుకు మాత్రం రవాణా ఏర్పాట్లు చేస్తోంది’ అంటూ మమతా మండిపడ్డారు.
ఇటీవల టీఎంసీ ముఖ్యనేతలు రాజీవ్ బెనర్జీ సహా మరో నలుగురు భాజపాలో చేరిన విషయం తెలిసిందే. వారు భాజపాలో చేరేందుకు దిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లడం గమనార్హం.
ఇదీ చదవండి
బడ్జెట్..రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.