నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు ఎలా ఉన్నాయి..?

కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సంవ‌త్స‌రానికి 5.80% నుండి 7.48% మ‌ధ్య వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి.

Updated : 09 Apr 2022 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌ముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ల‌కు చాలా కాలం నుంచి వడ్డీ రేట్లు త‌గ్గిపోవ‌డంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రాధాన్య‌ం పెరిగింది. ఈ కంపెనీలు బ్యాంక్ ఎఫ్‌డీల‌లో ఇచ్చే వ‌డ్డీ రేట్ల కంటే కాస్త ఎక్కువ వ‌డ్డీ ఇస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సంవ‌త్స‌రానికి 5.80% నుంచి 7.48% మ‌ధ్య వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి. ఇది బ్యాంక్ ఎఫ్‌డీలు, బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ల‌లో పొందేదాని కంటే ఎక్కువ‌. కార్పొరేట్ ఎఫ్‌డీల కాల‌ప‌రిమితి 12 నెల‌ల నుంచి 120 నెల‌ల మ‌ధ్య ఉంటుంది.

అయితే అన్ని ఫైనాన్స్ కంపెనీల‌లోనూ గుడ్డిగా డిపాజిట్ల‌ను చేయకూడదు. కంపెనీ ఎఫ్‌డీల క్రెడిట్ రేటింగ్‌ల‌ను త‌నిఖీ చేయ‌డం మ‌ర్చిపోకూడ‌దు. క్రిసిల్‌, ఇక్రా, కేర్ మొద‌లైన ఏజెన్సీల నుంచి `ఏఏఏ`, `ఏఏ`, `ఏఏ+` రేటింగ్‌ల‌ను క‌లిగి ఉన్న కంపెనీల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మ‌దుప‌ర్ల‌కు స‌కాలంలో డిపాజిట్ల‌ను తిరిగి చెల్లించే సంస్థ‌ల‌కు మంచి సామ‌ర్థ్యం ఉన్న‌ట్టు తెలిపే ఈ రేటింగ్‌ల‌ను.. రేటింగ్ సంస్థ‌లు ఇస్తున్నాయి. వివిధ కార్పొరేట్ సంస్థ‌లు డిపాజిట్ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌ను కూడా స‌రిపోల్చుకుని చూసుకోవాలి. డిపాజిట్ చేసేట‌పుడు నిబంధ‌న‌లు, ష‌ర‌తులు కచ్చితంగా తెలుసుకోవాలి.

అధిక‌ రేటింగ్ కంపెనీ ఎఫ్‌డీలను సుర‌క్షితంగా ప‌రిగ‌ణించ‌డ‌మే కాకుండా మీ డిపాజిట్‌ల‌కు అధిక వ‌డ్డీ రేటు ఇచ్చే అవ‌కాశం ఉంది. బ్యాంకు ఎఫ్‌డీల మాదిరిగానే ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీల‌పై మీరు సంపాదించే వ‌డ్డీపై శ్లాబ్‌ ప్ర‌కారం ఆదాయ‌పు ప‌న్ను ఉంటుంది. అధిక రేటింగ్ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీల‌లో మాత్ర‌మే మ‌దుపు చేయ‌డానికి ప్ర‌య‌త్నించాలి. అప్పుడే మ‌న పెట్టుబ‌డిపై రిస్క్‌ త‌గ్గుతుంది. స‌కాలంలో చెల్లింపునకు సంబంధించి భ‌ద్ర‌త స్థాయి బ‌లంగా ఉంద‌ని `ఏఏ` రేటింగ్ సూచిస్తుంది. `ఏఏ` లేదా అంత‌కంటే ఎక్కువ రేట్ ఉన్న కార్పొరేట్ ఎఫ్‌డీల జాబితా ఇక్క‌డ ఉంది. రూ. కోటి కంటే త‌క్కువ ఉన్న క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం అత్య‌ధిక వ‌డ్డీ రేటును ఈ ప‌ట్టిక చూపుతుంది. ప్ర‌స్తుతం 7.48% వ‌ర‌కు వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న టాప్-10 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు దిగువ పట్టికలో ఉన్నాయి.

గమనిక: ఈ డేటా 2022 ఏప్రిల్‌ 5వ తేదీనాటిది. కార్పొరేట్ కంపెనీలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.25% అద‌న‌పు వ‌డ్డీ రేటును ఇస్తున్నాయి. ఈ కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు ఆయా కంపెనీల వెబ్‌సైట్‌ల‌లో ఎఫ్‌డీ రేటింగ్‌ను త‌ప్ప‌క ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని