
అత్యంత ప్రమాదకర రోడ్లు ఏ దేశంలో ఉన్నాయో తెలుసా?
జోహెన్నస్‌బర్గ్ : అత్యంత ప్రమాదరక రోడ్లు కలిగిన దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో నిలిచింది. భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు 56 దేశాల్లో సర్వే నిర్వహించిన ఇంటర్నేషనల్ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ జుటోబీ తమ నివేదికను విడుదల చేసింది. ప్రమాదక రోడ్లు కలిగిన రెండో దేశంగా థాయ్‌లాండ్ నిలవగా.. అగ్రరాజ్యం అమెరికా మూడో స్థానంలో ఉంది.
ఇక అత్యంత సురక్షితమైన రోడ్లు నార్వేలో ఉన్నట్లు తేలింది. జపాన్, స్వీడన్ వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ఐదు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను సిద్ధం చేశారు. ప్రతి లక్ష మందిలో ఎంత మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు?; వాహనంలో ముందుభాగంలో కూర్చున్నవారిలో సీటు బెల్టు పెట్టుకుంటున్న వారి శాతం; మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై మరణించిన వారి సంఖ్య; రోడ్లపై అనుమతించే గరిష్ఠ వేగం; వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రోడ్ల ప్రమాద తీవ్రతను నిర్ధారించారు.
ఇవీ చదవండి...