అఫ్గాన్‌లో బాంబు పేలుళ్లు.. 15 మంది మృతి

తాలిబన్‌ ఉగ్రవాదులు మందుపాతర పేల్చి 15 మందిని..

Published : 29 Sep 2020 18:54 IST

కైరో: అఫ్గనిస్థాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి 15 మందిని హత్య చేశారు. సెంట్రల్‌ ప్రావిన్స్‌లోని దేకుండి ప్రాంతంలో మందుపాతర పేల్చి 15 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి తారిక్‌ అరియన్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై తాలిబన్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అఫ్గాన్‌ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలోనే మిలిటెంట్లు తమ దురాగతాలను కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని