50మంది చిన్నారులపై లైంగికవేధింపులు.. అరెస్ట్‌‌!

యూపీలో పదుల సంఖ్యలో చిన్నారులను లైంగికంగా వేధించిన ఓ ప్రబుద్ధుడిని సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తి పదేళ్ల వ్యవధిలో దాదాపు 50 మంది చిన్నారులపై వేధింపులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Published : 17 Nov 2020 19:42 IST

దిల్లీ: యూపీలో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం సృష్టించింది. పదుల సంఖ్యలో చిన్నారులపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఓ ప్రభుత్వ జూనియర్‌ ఇంజినీర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి పదేళ్ల వ్యవధిలో దాదాపు 50 మంది చిన్నారులపై వేధింపులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్‌ వెల్లడించిన ప్రకారం.. ‘చిత్రకూట్‌ జిల్లాకు చెందిన రామ్‌భవన్‌ అనే వ్యక్తి యూపీలో ప్రభుత్వ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు బండ, చిత్రకూట్, హమీర్పూర్‌ జిల్లాల్లో 5 నుంచి 16ఏళ్ల మధ్య వయసున్న దాదాపు50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని బండ జిల్లాలో అరెస్టు చేసి సంబంధిత న్యాయస్థానంలో ప్రవేశపెట్టాం. నిందితుడి ఇంటిపై నిర్వహించిన సోదాల్లో 8 మొబైల్‌ ఫోన్లు, రూ.8లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, ఇతర డిజిటల్‌ సాక్ష్యాలు, భారీ సంఖ్యలో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్స్‌, వీడియోలు స్వాధీనం చేసుకున్నాం. ఆ సమాచారాన్ని షేరింగ్‌ చేసుకునే విషయంలో అతడు పలువురు విదేశీయులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఈమెయిల్స్‌ ఆధారంగా తెలిసింది. తాను చేసే అసాంఘిక కార్యకలాపాల గురించి చిన్నారులు బయట చెప్పకుండా ఉండేందుకు మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వారికి లంచంగా ఇచ్చేవాడినని నిందితుడు దర్యాప్తులో చెప్పాడు’ అని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని