
కృష్ణా జిల్లాలో తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం: ఇంట్లో తల్లీ బిడ్డలు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీలో పరిధిలోని ఓ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూశారు. ఇంట్లో తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతిచెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషతుల్యమైన ఆహారం తినడంతోనే మృతిచెంది ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.