‘‘ఓఎల్ఎక్స్‌ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం’’

ఓఎల్ఎక్స్‌లో ఫోన్‌ అమ్మకానికి పెట్టినపుడు అవతలి వ్యక్తి మాట్లాడుతూ... ‘‘మీ ఫోన్‌ నేను కొంటానండి. రూ.10 పంపుతాను. క్యూఆర్ కోడ్ స్కాన్‌ చేసి కన్ఫర్మ్ చేయండి’’ అంటాడు. మీరు తొందరపడి వారు చెప్పిందంతా చేస్తారు. ఇంక అంతే ఫోన్‌ కట్‌ అవుతుంది.

Published : 27 Dec 2020 00:54 IST

 

హైదరాబాద్‌ : ఓఎల్ఎక్స్‌లో ఫోన్‌ అమ్మకానికి పెట్టినపుడు అవతలి వ్యక్తి మాట్లాడుతూ... ‘‘మీ ఫోన్‌ నేను కొంటానండి. రూ.10 పంపుతాను. క్యూఆర్ కోడ్ స్కాన్‌ చేసి కన్ఫర్మ్ చేయండి’’ అంటాడు. మీరు తొందరపడి వారు చెప్పిందంతా చేస్తారు. ఇంక అంతే ఫోన్‌ కట్‌ అవుతుంది. ఇంతలో మీ ఖాతాలోని నగదు అవతలి వ్యక్తి అకౌంట్‌లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక, ఎవరికీ చెప్పుకోలేక దిగాలుగా కూర్చుంటారు మీరు. లేదా పోలీసుల వద్దకు పరుగుతీస్తారు. ఎందుకంటారా? 

మీ అకౌంట్‌లో ఉండే డబ్బులు అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోయాయని మీకు అర్థం అవుతుంది కాబట్టి. ఏమిటీ ఇదంతా అనుకుంటున్నారా? ఓఎల్‌ఎక్స్‌లో లావాదేవీల గురించి. మోసగాళ్ల మాయలో పడొద్దని చెప్పే విధంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో గురించి. ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త అని సైబర్‌ క్రైం పోలీసులు ఎంత చెప్పినా ఇంకా చాలామంది ఆ ఉచ్చులో పడిపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో ద్వారా సూచించారు సీపీ సజ్జనార్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని