పార్టీకి పిలిచి సామూహిక అత్యాచారం

నిశ్చితార్థం పార్టీకి అని పిలిచి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. స్థానిక ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల మేరకు.. అవినాశ్‌ పంగీకర్‌, శిశిర్‌, తేజస్‌ అనే ముగ్గురు వ్యక్తులు బాధితురాలితో

Updated : 17 Nov 2020 05:00 IST

ముంబయి : నిశ్చితార్థం పార్టీకి అని పిలిచి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. స్థానిక ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల మేరకు.. అవినాశ్‌ పంగీకర్‌, శిశిర్‌, తేజస్‌ అనే ముగ్గురు వ్యక్తులు బాధితురాలితో పాటు మరో ఇద్దరు యువతులను నవంబరు 8న ముంబయిలోని అంథేరీ- కుర్లా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌కు పిలిపించుకున్నారు. పంగీకర్‌కు నిశ్చితార్థం జరగడంతో దానికి సంబంధించి పార్టీ ఇస్తామని ఈ ముగ్గురు వ్యక్తులు స్నేహితురాళ్లు అయిన యువతులను ఆహ్వానించారు. చీకటి పడుతున్న సమయంలో ఆ ముగ్గురిలో ఇద్దరు యువతులు ఇళ్లకు వెళ్లారు. మూడో యువతి కూడా వెళ్లబోతున్న సమయంలో పంగీకర్‌ ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
వారం రోజులుగా ఈ దుశ్చర్యను ఎవరికీ చెప్పుకోని బాధితురాలు శనివారం తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచారం జరిగినట్లు వెల్లడించింది. వాళ్ల సాయంతో  పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి పంపించారు. నిందితులుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు వాళ్లు గుర్తించారు.  నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.     

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని