UP: కాన్పూర్‌లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ సమీపంలోని సచెంది వద్ద ఓ మిని బస్సు జేసీబీని ఢీకొని ఆపై బ్రిడ్జి నుంచి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ సమీపంలోని సచెంది వద్ద ఓ మిని బస్సు జేసీబీని ఢీకొని ఆపై బ్రిడ్జి నుంచి కిందపడింది. దీంతో 17 మంది మృతి చెందినట్లు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలంలోనే పలువురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు లఖ్‌నవూ నుంచి దిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించారు. తక్షణమే ప్రమాదంపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షల పరహారం, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. -
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోటాలో చోటుచేసుకుంది. -
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ‘ఆఫ్టర్ 9’ పబ్‌పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. -
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్‌లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
గురుగ్రంథ్ సాహిబ్‌లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్‌స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి