Hyderabad: ‘25న నా పెళ్లి.. జైలుకెళ్లను’.. కోర్టులో రిమాండ్ ఖైదీ వీరంగం
గంజాయి కేసులో అరెస్టయిన ఓ నిందితుడు నాంపల్లి కోర్టులో హంగామా సృష్టించాడు. తనకు పెళ్లికుదిరిందని.. జైలుకు వెళ్లనంటూ హల్‌చల్ చేశాడు.

హైదరాబాద్: కోర్టులో ఓ నిందితుడు హల్‌చల్ సృష్టించాడు. ఈనెల 25న తన పెళ్లి ఉందని.. జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. కోర్టు లోపల డోర్‌కు ఉన్న అద్దాలు పగులకొట్టడంతో నిందితుడి చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం నాంపల్లి కోర్టులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఆనంద్ అగర్వాల్ రౌడీ షీటర్. ఇప్పటికే అతనిపై 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల గంజాయి కేసులో శాలిబండ పోలీసులు అగర్వాల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతనికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా తనకు పెళ్లి కుదిరిందని.. జైలుకు వెళ్లనని మొండికేశాడు. అంతటితో ఊరుకోకుండా కోర్టు లోపల డోర్ అద్దాలు ధ్వంసం చేశాడు. నిందితుడు అగర్వాల్‌పై గతంలోనూ పలు గంజాయి కేసులు నమోదయ్యాయి. ఓ మర్డర్ కేసు, దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి విడుదల అయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ
-
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు