బిహార్‌లో బ్యాంకు చోరీ 

బ్యాంకులోకి నలుగురు చొరబడ్డారు. ఆయుధాలతో బెదిరిస్తూ డబ్బు తీసుకుని సంచుల్లో నింపుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కోటి రూపాయలతో పరారయ్యారు.

Published : 11 Jun 2021 01:54 IST

హజీపూర్‌: బ్యాంకులోకి నలుగురు చొరబడ్డారు. ఆయుధాలతో బెదిరిస్తూ డబ్బు తీసుకుని సంచుల్లో నింపుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కోటి రూపాయలతో పరారయ్యారు. సిని ఫక్కీలో జరిగిన చోరీ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో చోటుచేసుకుంది. 

హజీపూర్‌ ప్రాంతంలోని జదువా బజార్‌ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు బ్యాంకు బ్రాంచీలో గురువారం భారీ చోరీ జరిగింది. ఈ బ్యాంకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ నివాసానికి సమీపంలోనే ఉండటం గమనార్హం. ఈ ఉదయం బ్యాంకు తెరిచిన కాసేటికి నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఆయుధాలతో లోపలికి వచ్చారు. ఉద్యోగులను బెదిరించి క్యాష్‌ రూం నుంచి డబ్బు తెప్పించారు. ఆ తర్వాత నగదును సంచుల్లో నింపుకుని అంతే వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. 

ఈ ఊహించిన ఘటనతో దిగ్భ్రాంతి చెందిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని