Honey Trap: మిలటరీ ఉద్యోగికి పాక్‌ యువతి హనీట్రాప్‌ 

బాలేశ్వర్‌ జిల్లా (ఒడిశా)లోని చాందీపూర్‌లోని అయిదుగురు

Published : 28 Oct 2021 11:08 IST

కటక్, న్యూస్‌టుడే: బాలేశ్వర్‌ జిల్లా (ఒడిశా)లోని చాందీపూర్‌లోని అయిదుగురు డీఆర్‌డీఓ ఉద్యోగులకు వలపు వల విసిరి (హనీట్రాప్‌) రహస్యాలు సేకరించిన పాకిస్థాన్‌కు చెందిన యువతి.. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని మిలటరీ ఇంజినీర్‌ సర్వీసెస్‌ నుంచి రహస్యాలు రాబట్టేందుకు ప్రయత్నించిందని ఒడిశా క్రైం బ్రాంచ్‌ బుధవారం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగితో పరిచయం పెంచుకొని, ప్రలోభ పెట్టి రహస్యాలు తెలుసుకోవాలనుకుందని వివరించింది. ఈ ఘటనపై రాజస్థాన్‌ క్రైం బ్రాంచ్‌ కేసు నమోదు చేసి, ఒడిశా క్రైం బ్రాంచ్‌ను సంప్రదించిందని వెల్లడించింది. ఇటీవల చాందీపూర్‌ డీఆర్‌డీవో రహస్యాలు, ఫొటోలు లీక్‌ చేసిన ఆరోపణల్లో క్రైం బ్రాంచ్‌ అయిదుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని విచారించగా ఈ కుట్ర వెనుక పాకిస్థాన్‌కు చెందిన యువతి ఉన్నట్లు బయటపడింది. ఇప్పటికీ సదరు యువతికి చెందిన కొన్ని ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్న ఒడిశా క్రైం బ్రాంచ్, యువతిని గుర్తించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకున్నట్లు తెలిపింది. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని