యువకుడి ఆత్మహత్య

శృంగవరపుకోట పట్టణంలో శనివారం సాయంత్రం ధర్మవరం గ్రామానికి చెందిన రెడ్డి ఎర్నాయుడు(24) బంధువుల ఇంట్లో ఉరి పోసుకొని మృతి చెందాడు.

Updated : 04 Dec 2022 04:32 IST

ఎర్నాయుడు (దాచిన చిత్రం)

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: శృంగవరపుకోట పట్టణంలో శనివారం సాయంత్రం ధర్మవరం గ్రామానికి చెందిన రెడ్డి ఎర్నాయుడు(24) బంధువుల ఇంట్లో ఉరి పోసుకొని మృతి చెందాడు. దీనికి సంబంధించి ఎస్‌ఐ లోవరాజు అందించిన వివరాల ప్రకారం.. ఎర్నాయుడు ఒక మొబైల్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఎస్‌.కోట పట్టణం అఫీషియల్‌ కాలనీలో నివాసం ఉంటున్న వరుసకు సోదరి అయ్యే ఆమె వద్ద తాళాలు తీసుకొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. స్నేహితుడు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా పంకాకు ఉరిపోసుకొని చనిపోయి కనిపించాడు. చదువుకోనందున, ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు తప్ప ఇతర కారణాలు లేవని తండ్రి వెంకటరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లోవరాజు తెలిపారు.


చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలోని అప్పన్నదొరవలసలో చలి కాచుకుంటూ అగ్ని ప్రమాదానికి గురైన వృద్ధుడు మృతి చెందారు. ఈ నెల 1న డి.సత్యం నాయుడు(66) ఇంట్లో కుంపటి వద్ద చలి కాస్తుండగా ప్రమాదవశాత్తూ ఒంటికి నిప్పంటుకుంది. తీవ్రంగా గాయాలపాలైన ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


విధి నిర్వహణకు వెళ్తూ మృత్యుఒడికి..

గరివిడి, న్యూస్‌టుడే: కళాశాల వద్ద విధులు నిర్వహించడానికి వెళ్తున్న రాత్రి కాపలాదారుడిని మృత్యువు ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చి కాటేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గరివిడి ఉపాధ్యాయ కాలనీలో నివాసం ఉంటున్న తాడివలస త్రినాథ్‌ (60) ఎస్‌డీఎస్‌ డిగ్రీ కళాశాలలో రాత్రి కాపలావిధులకు సైకిల్‌పై వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎస్‌ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు