ఇంటర్‌లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం

ఇంటర్‌లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్‌లో సోమవారం జరిగింది.

Updated : 07 May 2024 06:52 IST

నడికూడ, న్యూస్‌టుడే: ఇంటర్‌లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్‌లో సోమవారం జరిగింది. దామెర ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్‌కు చెందిన గాజ కుమారస్వామి(47) కుమార్తె శ్రీవిద్య (19) గతేడాది ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయింది. ఈ ఏడాది తిరిగి ఇంటర్‌ పరీక్షలు రాయగా మళ్లీ ఫెయిలవ్వడంతో మనస్తాపం చెందిన శ్రీవిద్య సోమవారం ఇంటి వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను పరకాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతోంది. తన కుమార్తె బతుకుతుందో లేదోనన్న బాధతో కుమారస్వామి సాయంత్రం కంఠాత్మకూర్‌ శివారులోని పిడుగుగుట్ట సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఒకవైపు కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా మరో వైపు తండ్రి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని