బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు

పశ్చిమబెంగాల్‌లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి.

Published : 07 May 2024 06:23 IST

ఈటీవీ భారత్‌: పశ్చిమబెంగాల్‌లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. సోమవారం ఉదయం 8.00 గంటలకు హుగలీ జిల్లాలోని పాండువాలో ఈ ఘటన జరిగింది. రాజ్‌ బిస్వాస్‌ (11) అనే బాలుడు కాలితో తన్నగానే బాంబు భారీశబ్దంతో పేలిపోయింది. గాయపడిన బాలుణ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. బుర్ద్వాన్‌కు చెందిన రాజ్‌ బిస్వాస్‌ వేసవి సెలవుల్లో పాండువాలోని తన మామయ్య ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు బాలురను రూపమ్‌ బల్లభ్‌ (13), సౌరవ్‌ చౌధరి (13)గా గుర్తించారు. వీరిద్దరూ ఏడో తరగతి చదువుతున్నారు. సోమవారం పాండువాలో మరికొన్ని గంటల్లో టీఎంసీ అగ్రనేత అభిషేక్‌ బెనర్జీ బహిరంగ సభ జరగనుండగా ఈ ఘటన నమోదుకావడం కలకలం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని