టిప్పర్ బీభత్సం.. ముగ్గురి మృతి
వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ ముగ్గురి ప్రాణాలు తీసింది. దాని వేగానికి ఓ ఆలయం నేలమట్టమైంది. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వాహనం ఢీకొనడంతో నేలమట్టమైన గుడి
తొండంగి, న్యూస్‌టుడే: వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ ముగ్గురి ప్రాణాలు తీసింది. దాని వేగానికి ఓ ఆలయం నేలమట్టమైంది. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అన్నవరం నుంచి తొండంగికి గ్రావెల్‌తో వెళ్తున్న టిప్పర్ ఎ.కొత్తపల్లి వద్ద రోడ్డు పక్కన కట్టిన నీటి ట్యాంకును ఢీకొంది. అటు నుంచి ఆ పక్కనే ఉన్న గుడిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం కూలిపోయింది. ఆ సమయంలో అందులో నిద్రిస్తున్న ఎ.కొత్తపల్లికి చెందిన తూము లక్ష్మణరావు (48)తోపాటు టిప్పర్ నడుపుతున్న ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన చుక్కల చంద్రశేఖర్ (28), అదే గ్రామానికి చెందిన క్లీనర్ కానూరి నాగేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ వేగం ధాటికి నీటి ట్యాంకు మీటరు మేర పక్కకు ఒరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delhi: బైక్ దొంగల వెనుక ఉగ్ర నెట్వర్క్.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!
-
Angallu case: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ
-
KTR - Modi: మోదీ.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర?: కేటీఆర్
-
Maharashtra: నాందేడ్ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగుల మృతి
-
Satya Nadella: గూగుల్ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల
-
India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్..!