మూత్ర విసర్జనకు అడ్డు చెప్పాడని.. విద్యార్థిపైకి కారు పోనిచ్చి చంపాడు

పదో తరగతి విద్యార్థిపై కారు పోనిచ్చి అతడి మరణానికి కారణమైన వ్యక్తిపై కేరళ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. నిందితుడు.. బాధిత కుటుంబానికి దూరపు బంధువు.

Updated : 22 Feb 2024 14:42 IST

పదో తరగతి విద్యార్థిపై కారు పోనిచ్చి అతడి మరణానికి కారణమైన వ్యక్తిపై కేరళ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. నిందితుడు.. బాధిత కుటుంబానికి దూరపు బంధువు. తిరువనంతపురం జిల్లాలోని పూవాచల్‌ ప్రాంతంలో ఆగస్టు 30న జరిగిన ఈ హత్యకుట్ర ఆలస్యంగా బయటపడింది. ఆ రోజు సాయంత్రం.. సైకిలుపై బయటకు వెళ్దామనుకున్న శేఖర్‌ (15) తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీదుకు వచ్చాడు. అదే సమయంలో వెనుక నుంచి కదలిన కారు శేఖర్‌ మీదుగా వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు. కొంతమంది బంధువుల ఫిర్యాదుతో సీసీ టీవీ విజువల్స్‌ పరిశీలించగా.. నిందితుడు ప్రియరంజన్‌ గుట్టు రట్టయింది. ఈ హత్యకు కొన్నిరోజుల ముందు ప్రియరంజన్‌ స్థానిక ఆలయం వద్ద మూత్రవిసర్జన చేశాడు. దీన్ని తప్పుపడుతూ శేఖర్‌ నిలదీశాడు. హత్యకు ఇదే కారణమై ఉంటుందన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని