Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన

ఓ ఇంటికి సర్వీసు కనెక్షన్‌ ఇచ్చేందుకు విద్యుత్‌ స్తంభం ఎక్కిన ప్రైవేట్‌ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై తీగలపైనే తలకిందులుగా వేలాడుతూ నరకయాతన పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 04 Oct 2023 08:01 IST

రఘునాథపల్లి, న్యూస్‌టుడే: ఓ ఇంటికి సర్వీసు కనెక్షన్‌ ఇచ్చేందుకు విద్యుత్‌ స్తంభం ఎక్కిన ప్రైవేట్‌ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై తీగలపైనే తలకిందులుగా వేలాడుతూ నరకయాతన పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. విద్యుత్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచనపల్లిలో ఓ కొత్త విద్యుత్‌ స్తంభం వేయడానికి సబ్‌స్టేషన్‌ సిబ్బంది విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఇదే సమయంలో ప్రైవేటు కార్మికుడు బాస్కుల కిరణ్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా బీసీ కాలనీ సమీపంలో ఓ ఇంటి సర్వీసు కనెక్షన్‌ ఇచ్చేందుకు స్తంభం ఎక్కాడు. విషయం తెలియని అధికారులు స్తంభం వేసే పని పూర్తవగానే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. దీంతో కిరణ్‌ విద్యుదాఘాతానికి గురై తీగలకు వేలాడుతూ హాహాకారాలు చేయసాగారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తాళ్ల సహాయంతో కిరణ్‌ను కిందకు దింపారు. జనగామలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు