ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ తప్పనిసరి

తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఈ-పాస్‌ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్‌ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 07 May 2024 06:17 IST

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఈ-పాస్‌ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్‌ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులు తమ వివరాలు, వాహనాల నంబరు, వచ్చే రోజు, బస చేసే రోజులు, బస చేసే చోటు వంటి వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడించి ఈ-పాస్‌ పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లే పర్యాటకులు, వ్యాపారులు వివరాలను epass.tnega.org వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి ఈ-పాస్‌ పొందవచ్చు. వాహన రద్దీని క్రమబద్ధీకరించడానికే ఈ విధానం అమలు చేసినట్టు, దీని వల్ల పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానం జూన్‌ 30 వరకు మాత్రమే అమలులో ఉంటుందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని