Nellore: భార్య ఎదుటే 25 కత్తిపోట్లు.. భర్త దారుణహత్య!

నెల్లూరు జిల్లా రామచంద్రపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.

Updated : 19 Feb 2024 10:01 IST

రామచంద్రాపురం: నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. శరీరంపై 25కుపైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై అధికారికంగా వారు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని