టోల్‌ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అయి..

సీఎం కాన్వాయ్‌ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. 

Updated : 09 May 2024 12:24 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) కాన్వాయ్‌ను ఓ వ్యక్తి కారులో అనుసరించాడు. దీనిని గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో వీడియోలు చేసే శుభమ్‌ కుమార్ అనే వ్యక్తి.. ముంబయిలోని బాంద్రా వర్లీ సీలింక్ వద్ద శిందే కాన్వాయ్‌ను తన కారులో ఫాలో అయ్యాడు. అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు వారిస్తున్నా వినకుండా టోల్‌ప్లాజా వద్ద వీఐపీలేన్‌లోకి తన వాహనాన్ని కూడా పోనిచ్చాడు. దాంతో అప్రమత్తమైన అధికారులు వర్లీ వద్ద అతడిని అరెస్టు చేసి, బాంద్రా పోలీసులకు అప్పగించారు. టోల్‌ఛార్జ్‌ తప్పించుకోవడానికే తాను కాన్వాయ్‌ను అనుసరించినట్లు చెప్పాడు. ర్యాష్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద అతడిపై కేసు నమోదైంది. అప్పుడు శిందే కాన్వాయ్‌ థానె నగరం నుంచి సీఎం అధికారిక నివాసం వైపు వెళ్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని