Crime news: కుప్పకూలిన సున్నపురాయి గని.. ఏడుగురి మృతి.. శిథిలాల్లో మరో 15 మంది!
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జగ్దల్‌పూర్ జిల్లాలోని మాలేగావ్‌లో సున్నపురాయి గని కుప్పకూలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరో 15 మంది ఉన్నట్లు సమాచారం.
జగ్దల్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జగ్దల్‌పూర్ జిల్లాలోని మాలేగావ్‌లో సున్నపురాయి గని కుప్పకూలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరో 15 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గనిలో మట్టి తవ్వుతున్న క్రమంలో ఒక్కసారిగా పెళ్లలు విరిగిపడటంతో బాధితులు అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. హుటాహుటిన సంఘటన స్థలికి వెళ్లిన ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఐదుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, సహాయకచర్యలు కొనసాగిస్తున్నామని జగ్దల్‌పూర్ జిల్లా అధికారులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: రేవంత్ పాదయాత్ర..షెడ్యూల్ ఇదే
-
World News
Pervez Musharraf: భారత్‌లోకి చొరబడి మీటింగ్ పెట్టిన ముషారఫ్..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Hanuma Vihari: అలా చేస్తే నా కెరీర్లో రిస్క్‌లో పడుతుందని ఆయన చెప్పాడు: హనుమ విహారి
-
Movies News
Social Look: హల్దీ వేడుకలో పూజాహెగ్డే.. సమంత ‘లైట్’ పోస్ట్!
-
India News
Loan Apps: 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా!