
Crime News: బోర్‌వెల్ లారీలో భారీగా గంజాయి రవాణా..
తుని: తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. అద్దిరిపేట వద్ద బోర్‌వెల్ లారీలో తరలిస్తున్న రూ.2 కోట్లు విలువ చేసే వెయ్యి కిలోల గంజాయిని తుని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితులకు గతంలోనూ గంజాయి రవాణాతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.