Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

Mexico: మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో మంగళవారం ఓ ట్రక్కు, డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొనటంతో కనీసం 19 మంది మృతిచెందారు.

Published : 31 Jan 2024 08:54 IST

మెక్సికో సిటీ: మెక్సికోలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సినాలోవా రాష్ట్రంలో మంగళవారం ఓ ట్రక్కు, డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎలోటా పట్టణంలో.. తీరప్రాంత నగరాలైన మజట్లాన్, లాస్ మోచిస్‌ను కలిపే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 37 మంది ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంటలంటుకొని రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అదుపులోకి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు