Wordle: పదవినోదం.. ఆమె ప్రాణాలు కాపాడింది!

పదవినోదం ఆడితే కాలక్షేపం అవడమే కాదు.. మెదడుకు పదును పెట్టి.. తెలివితేటలు పెంచుతుంది. అయితే, ఇదే ఆట ఓ వృద్ధురాలి ప్రాణాల్ని

Published : 12 Feb 2022 02:17 IST

వాషింగ్టన్‌: పదవినోదం ఆడితే కాలక్షేపం అవడమే కాదు.. మెదడుకు పదును పెట్టి.. తెలివితేటలు పెంచుతుంది. అయితే, ఇదే ఆట ఓ వృద్ధురాలి ప్రాణాల్ని సైతం కాపాడింది. ఒక దుండగుడి చెర నుంచి రక్షించింది. ఎలాగంటారా? అయితే ఇది చదవండి..

పదవినోదానికి సంబంధించి రకరకాల గేమ్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ‘వర్డిల్‌’ అనే గేమ్‌ యాప్‌ అంతర్జాతీయంగా పాపులరైంది. ఇందులో కొన్ని ఆంగ్ల అక్షరాలను ఇచ్చి వాటిల్లో ఐదు అక్షరాల ఒక పదాన్ని ఆరు ప్రయత్నాల్లో కనుగొనాలి. ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో కనుగొంటే అంత ఎక్కువ స్కోరు లభిస్తుంది. అయితే, చికాగోకి చెందిన 80ఏళ్ల డెన్సె హోల్ట్‌ ఈ ఆటకు అలవాటు పడింది. ఒంటరిగా జీవిస్తున్న ఆమె.. ప్రతి రోజు రాత్రి ఈ గేమ్‌ ఆడి సాధించిన స్కోరును సియాటిల్‌లో ఉన్న తన పెద్ద కుమార్తె మెరెడిత్‌ హోల్ట్‌ కాల్డ్‌వెల్‌కి పంపిస్తుంటుంది. అయితే, ఫిబ్రవరి 5న ఒక దుండగుడు హోల్ట్‌ ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో బెదిరించి ఆమెను సెల్లార్‌లో బందించాడు. దీంతో ఆ రాత్రి ‘వర్డిల్‌’ గేమ్‌ ఆడి స్కోరును తన కుమార్తెకి పంపించలేకపోయింది. దీంతో కాల్డ్‌వెల్‌కు అనుమానం వచ్చి చికాగో పోలీసులకు సమాచారం ఇచ్చింది.

మరుసటి రోజు ఉదయం పోలీసులు హోల్ట్‌ ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తుండగా.. దుండగుడు ఎదురుపడ్డాడు. కొన్ని గంటలపాటు శ్రమించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సెల్లార్‌లో బందిగా ఉన్న హోల్ట్‌ను రక్షించారు. దుండగుడిని 32ఏళ్ల జేమ్స్‌ డేవిస్‌గా గుర్తించిన పోలీసులు అతడికి మతిస్థిమితం లేనట్లు భావిస్తున్నారు. కిటికీ అద్దాలు బద్దలుకొట్టుకొని ఇంట్లోకి వచ్చిన దుండగుడు తనని బెదరించాడని, ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని హోల్ట్‌ చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని