logo

పీఆర్సీ రద్దుకు దశలవారీ ఆందోళనలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీలో 23 శాతం ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏలో శ్లాబ్‌ల తగ్గింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21న ఏపీ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో

Updated : 20 Jan 2022 06:15 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీలో 23 శాతం ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏలో శ్లాబ్‌ల తగ్గింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21న ఏపీ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు పాల్గొనాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. నూతన పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు. దశల వారీగా చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల్లో పీఆర్‌ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి హక్కులను కాపాడుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని