logo

గురుకుల్లాల్లో చదువుకుందాం రారండి!

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో అయిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.

Updated : 19 May 2022 04:35 IST

భీమునిపట్నం, న్యూస్‌టుడే


భీమిలి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో అయిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రూ.50 దరఖాస్తు రుసుం చెల్లించి ఏపీఆర్‌ఎస్‌.ఏపీసీిఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలి. సీట్లు లభించిన విద్యార్థులకు పదోతరగతి వరకు పాఠశాల, హాస్టల్‌ వసతి ఒకేచోట కల్పిస్తూ ఉచిత విద్యను అందించి ప్రోత్సహిస్తారు. తర్వాత జరిగే ఆంధ్రప్రదేశ్‌ గరుకుల జూనియర్‌ కళాశాల(ఏపీఆర్‌జేసీ) ఎంట్రన్స్‌లో సీట్లు లభిస్తే వరుసగా రెండేళ్ల ఇంటర్మీడియట్‌ విద్య కూడా కొనసాగించేందుకు అవకాశం లభిస్తుంది.

ప్రవేశాల కోసం అర్హతలు

* ప్రభుత్వ గుర్తింపు కల్గిన పాఠశాలలో 2020-2021లో మూడో తరగతి, 2021-2022లో నాలుగో తరగతి చదివి ఉండాలి.

* ఇందులో ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.ే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుంచి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.

* ఓసీ, బీసీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చదివి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ అర్హులుగా పరిగణిస్తారు.

* విద్యార్థి తల్లిదండ్రులతోపాటు సంరక్షకుల వార్షికాదాయం (2021-2022) రూ.లక్షకు మించి ఉండరాదు

* ఇందులో తెల్లరేషన్‌ కార్డుదారులకు, సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని గురుకులాలు

* భీమునిపట్నం(బాలికలు) * అచ్యుతాపురం(బాలికలు) * నర్సీపట్నం(బాలురు)

సంప్రదించాల్సిన చరవాణి సంఖ్యలు

98665 59618, 94410 23972


లాటరీ పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక

గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులకు సంబంధించి జూన్‌ 10వ తేదీన లాటరీ నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఎంపికయిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తాం. గురుకులాల్లో క్రమశిక్షణతో కూడిన విద్య లభించడంతోపాటు జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోటానికి మార్గం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలతో దరఖాస్తు చేయించాలని కోరుతున్నాం.

-కోడి రాంబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్‌ ప్రధానాచార్యులు, ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, భీమునిపట్నం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని