logo

ఎన్టీఆర్‌ పేరు తొలగింపు హేయం

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేవరకూ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. పాడేరులోని పాత బస్టాండ్‌ కూడలి వద్ద తెదేపా శ్రేణులు చేపడుతున్న రిలే దీక్షలు గురువారం రెండో రోజు కొనసాగాయి. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, కొయ్యూరు మండలం

Published : 30 Sep 2022 00:53 IST

దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేవరకూ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. పాడేరులోని పాత బస్టాండ్‌ కూడలి వద్ద తెదేపా శ్రేణులు చేపడుతున్న రిలే దీక్షలు గురువారం రెండో రోజు కొనసాగాయి. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, కొయ్యూరు మండలం తెదేపా నాయకులు దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు హేయమైన చర్య అన్నారు.  తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌ను అవమానించేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. బొర్రా నాగరాజు మాట్లాడుతూ అబద్దాలతో గద్దెనెక్కిన జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేతకాక ప్రతిపక్షాలనే టార్గెట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారని ఆరోపించారు. కొయ్యూరు మండల తెదేపా అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి తోట దొరబాబు, ఎస్టీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి రామమూర్తి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని