logo

ఆసుపత్రిలో నేనుండలేను బాబోయ్‌!

మన్యంలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినా గిరిజనుల్లో మార్పు రావడం లేదు.

Published : 03 Oct 2022 01:40 IST

బాలింతకు అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారి నరేష్‌

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మన్యంలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినా గిరిజనుల్లో మార్పు రావడం లేదు. గూడెంకొత్తవీధి మండలం ధారకొండ పంచాయతీ పర్తండపాడు గ్రామానికి చెందిన పాంగి సొనో గతనెల 28న చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. శిశువుకు పచ్చకామెర్లు సోకడంతో కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని చిన్నపిల్లల వైద్యులు నరేష్‌ వారికి తెలిపారు. ఇంతలో బాలింత తన చంటి బిడ్డతో ఆదివారం ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె భర్త అర్జున్‌ను వైద్య సిబ్బంది ప్రశ్నించగా.. ఇంటికి వెళ్లిపోతానని చెప్పి బయటకు వెళ్లిపోయిందని సమాధానం చెప్పారు. సిబ్బందిని ఆమెను వెతికి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇంటికి వెళ్లిపోతే తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదమని ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. సుమారు గంటసేపు అవగాహన కల్పించి భార్యాభర్తలను ఒప్పించి ఆసుపత్రిలో ఉంచారు. సొనోకు ఇది తొమ్మిదో కాన్పు కావడం గమనార్హం. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవాలని అర్జున్‌కు వైద్యులు చెప్పగా.. తాను చేసుకోనంటూ సమాధానమిచ్చారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని