logo

అధికారులు రాని గ్రామసభలెందుకు?

అధికారులు రాని గ్రామసభలు తమకెందుకని సీలేరు గ్రామస్థులు ప్రశ్నించారు. సోమవారం సీలేరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచి కె.పరదేశీ అధ్యక్షతన గ్రామసభ జరిగింది.

Published : 04 Oct 2022 02:38 IST


గ్రామసభలో మాట్లాడుతున్న సర్పంచి పరదేశీ

సీలేరు, న్యూస్‌టుడే: అధికారులు రాని గ్రామసభలు తమకెందుకని సీలేరు గ్రామస్థులు ప్రశ్నించారు. సోమవారం సీలేరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచి కె.పరదేశీ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల వివరాలను కార్యదర్శి శ్రీనివాసు వివరించారు. సర్పంచి మాట్లాడుతూ జాబ్‌కార్డుదారులందరికీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ వీధుల్లో పశువుల సంచారం ఎక్కువగా ఉందని, వీటిని యజమానులు పట్టించుకోకపోతే గోశాలకు తరలిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామసభలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని, మండలస్థాయి అధికారులు ఎవరూ రావడం లేదన్నారు. మేజర్‌ పంచాయతీ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎంపీటీసీ సభ్యుడు పి.సాంబమూర్తి, ఉప సర్పంచి కె.వల్లీప్రసాదు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని