logo

పింఛను మంజూరు చేయరూ..

తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని తాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ తమర్బ పార్వతి అధికారులను వేడుకుంటోంది.

Published : 26 Nov 2022 02:26 IST

పిల్లలతో పార్వతి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని తాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ తమర్బ పార్వతి అధికారులను వేడుకుంటోంది. ఈమె భర్త రాజబాబు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భర్త మరణించిన తరువాత వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా.. నేటికీ రాలేదు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం ఉండటం లేదని ఆమె వాపోతోంది. తనకు ఎటువంటి ఆధారం లేదని, కూలి పనులు చేసుకుని జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి గోవిందును సంప్రదించగా హౌస్‌ ఓల్డ్‌ మ్యాపింగ్‌ అవ్వని కారణంగా పింఛను మంజూరు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని