logo

పంచాయతీకి కోటిన్నర వెచ్చించాం

గత మూడేళ్లలో ఒక్కో పంచాయతీలో ప్రభుత్వం కనీసం రూ. 1.5 కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేసిందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు.

Published : 04 Dec 2022 00:49 IST

లబ్ధిదారుకు బియ్యం అందజేస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: గత మూడేళ్లలో ఒక్కో పంచాయతీలో ప్రభుత్వం కనీసం రూ. 1.5 కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేసిందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. చొంపి పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సంక్షేమ పథకాలను వివరించి లబ్ధిదారులకు అందుతున్నాయో లేదా అని ఆరా తీశారు. చొంపిలో సంచార వాహనం వద్ద లబ్ధిదారులకు బియ్యం తూచి అందజేశారు. సర్పంచి సుభద్ర, ఎంపీపీ ఉషారాణి, ఎంపీడీఓ వెంకటేష్‌, ఎంఈఓ భారతీరత్నం, వార్డు సభ్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: గిరిజన ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఊతమిస్తోందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. కురిడి పంచాయతీ శరత్‌నగర్‌లో శనివారం ఆయన పర్యటించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్గాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు.  ప్రతిపక్ష పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని చెప్పారు. జడ్పీటీసీ సభ్యులు బొంజుబాబు, వైకాపా సీనియర్‌ నాయకులు సింహాచలం, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని