logo

నాలుగేళ్లయినా అవస్థలే..!

మన్యంలో రహదారి సదుపాయం లేక గిరిజనులకు రవాణా కష్టాలు తీరడం లేదు. కొల్లాపుట్టు పంచాయతీ ఎగువ కొల్లాపుట్టులో మెటల్‌ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.

Published : 06 Dec 2022 01:34 IST

నిత్యావసర సరకులతో కాలినడకన వెళ్తున్న గిరిజనులు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: న్యంలో రహదారి సదుపాయం లేక గిరిజనులకు రవాణా కష్టాలు తీరడం లేదు. కొల్లాపుట్టు పంచాయతీ ఎగువ కొల్లాపుట్టులో మెటల్‌ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. నాలుగేళ్ల క్రితం ఇక్కడ పనులు ప్రారంభించినా నేటికీ పూర్తికాలేదు. ఈ మార్గంలో కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని గిరిజనులు వాపోతున్నారు. రోగులను ఆసుపత్రుల్లో తరలించేందుకు డోలీ మోతలే దిక్కవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్లు నడిచి నిత్యావసరాలు తెచ్చుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అసంపూర్తి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని