logo

విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఆనంద్‌

విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా దివంగత ఆడారి తులసీరావు తనయుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 27 Jan 2023 02:28 IST

బాధ్యతలు స్వీకరిస్తున్న ఆనంద్‌కుమార్‌

ఎలమంచిలి, న్యూస్‌టుడే: విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా దివంగత ఆడారి తులసీరావు తనయుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ డెయిరీ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లంతా కలిసి ఈయన్ను ఎన్నుకున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం జిల్లాల్లోని రైతులకు సేవలందిస్తున్న విశాఖ డెయిరీలో 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. సమావేశ మందిరంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో పాయకరావుపేట నియోజకవర్గం డైరెక్టర్‌ రెడ్డి రామకృష్ణ ఆనంద్‌కుమార్‌ పేరును ఛైర్మన్‌గా ప్రతిపాదించగా, విజయనగరం జిల్లా డైరెక్టర్‌ కోళ్ల కాటమయ్య బలపర్చారు. మిగిలిన డైరెక్టర్లు అంతా ఆమోదించారు. దీంతో ఛైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఆడారి తులసీరావు 1986 ఆగస్టు 27న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 36 సంవత్సరాలు పాటు ఆయనే పదవిలో కొనసాగారు. అనారోగ్యంతో ఆయన ఈ ఏడాది జనవరి 4న మృతి చెందారు. దీంతో వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్‌కుమార్‌ ఇప్పటి వరకు ఆ బాధ్యతలను కొనసాగించారు. ఛైర్మన్‌గా ఎన్నికైన ఆనంద్‌ను ఎండీ ఎస్‌వీ రమణ ఇతర అధికారులు, డెయిరీ డైరెక్టర్లు సన్మానించారు. ఆనంద్‌కుమార్‌కు ముఖ్యమంత్రి జగన్‌, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు మంత్రులు ఫోన్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని