logo

ముఖ ఆధారిత హాజరు రద్దు చేయాలి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీగార్డులకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు.

Published : 09 Feb 2023 02:11 IST

జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీగార్డుల ధర్నా

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీగార్డులకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. గంటపాటు ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. ఈ సందర్భంగా సుందరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.16 వేలు ఇవ్వాల్సి ఉన్నా గుత్తేదారులు రూ.9 వేలు నుంచి రూ.10,700 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన జీతం ప్రకారం పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేస్తూ ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.13,900లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు ముఖహాజరు, బయోమెట్రిక్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా కార్మికులను నియమించాలని కోరారు. అనంతరం జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.ముత్యాలమ్మ, లక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని