వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా.. నలుగురు గాయపడ్డారు. మారేడుమిల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు మృతి చెందాడు.
నలుగురికి గాయాలు
మారేడుమిల్లి, న్యూస్‌టుడే
శ్రీనివాసరెడ్డి మృతదేహం
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా.. నలుగురు గాయపడ్డారు. మారేడుమిల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు మృతి చెందాడు. మారేడుమిల్లి వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని మినీ వ్యాను ఢీ కొట్టడంతో ఇద్దరు గిరిజనులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తాడేపల్లి పంచాయతీ కొడవటిలంక గ్రామానికి చెందిన కత్తుల శ్రీనివాసరెడ్డి (32), డి.వెలమలకోట గ్రామానికి చెందిన తుంబుడు మంగిరెడ్డి మారేడుమిల్లిలో చదువుతున్న తమ పిల్లలను చూడడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన గిరిజనులను 108 అంబులెన్సులో తొలుత రంపచోడవరం తీసుకెళ్లారు. అక్కడి నుంచి కాకినాడ తరలించారు. చికిత్స పొందుతూ కత్తుల శ్రీనివాసరెడ్డి (32) మంగళవారం ఉదయం మృతి చెందాడని మారేడుమిల్లి ఎస్సై ఎన్.రాము తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గాయపడిన మరో గిరిజనుడి పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.
నుజ్జయిన ద్విచక్ర వాహనం
డ్రైవరుకు కళ్లు తిరిగి చెట్టుకు కారు ఢీ..
మృతి చెందిన చిదంబర్
చింతూరు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద మంగళవారం జరిగింది. ఒడిశాలోని కొరాపుట్‌కు చెందిన ఆరుగురు హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాహనం నడుపుతున్న చిదంబర్‌కు కళ్లు తిరగడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవింగ్ సీటులో ఉన్న చిదంబర్ (52) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో మహిళలు మోనాలిసా, బింబాధర, పూల్‌రాణి, లక్ష్మిలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన కారు
లారీని ఢీకొని యువకుడు
రోడ్డుపై బైకు
ఎటపాక: ఎటపాక మండలం లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎటపాక మండలం గొమ్ము కోయగూడెం గ్రామానికి చెందిన మడకం వెంకటేష్ (36) ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పని నిమిత్తం నెల్లిపాక మీదుగా చింతూరు బయలుదేరారు. లక్ష్మీపురం వద్ద చింతూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. దీంతో వెంకటేష్ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పార్థసారధి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్
-
Sports News
WTC Final: భారత్ గోల్డెన్ అవర్‌ను చేజార్చుకొంది: పాంటింగ్
-
General News
Viveka Murder case: అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో మంగళవారం విచారణ
-
Movies News
Nayanthara: ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. నయనతారకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన విఘ్నేశ్
-
India News
Biparjoy : మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపర్ జోయ్
-
Sports News
Rishabh Pant: టీమ్ ఇండియా కోసం పంత్ మెసేజ్..!