తెలుగు జాతికి వెలుగు సందేశం
తెలుగు వాణికి వెలుగులద్దిన మహనీయుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం శివారున తెదేపా మహానాడు వైభవంగా జరుగుతోంది.
ఈనాడు, రాజమహేంద్రవరం
పూల వాన : ఎన్టీఆర్ విగ్రహం వద్ద..
తెలుగు వాణికి వెలుగులద్దిన మహనీయుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం శివారున తెదేపా మహానాడు వైభవంగా జరుగుతోంది. తొలిరోజు శనివారం ఉభయ తెలుగురాష్ట్రాల ప్రతినిధుల సభ నిర్వహించారు. అంచనాలకు మించి హాజరుకావడంతో వేదికలు, ప్రాంగణాలు కిక్కిరిశాయి. పార్టీ శ్రేణులు, వాలంటీర్లు, ఆయా విభాగాల సమన్వయకర్తలు తక్షణ ఏర్పాట్లతో సౌకర్యాలు కల్పించారు. ఆటంకాలను అధిగమించి..
వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలుచల్లి ఘన నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం, ఎన్నికలకు సమాయత్తం తదితరాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణం, వేదికపై లోకేశ్ అందరికీ నమస్కరిస్తూ పలకరించారు. పలువురితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన ముఖ్య నాయకులూ వేదికపై ప్రసంగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడారు. తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మలతో సందడి చేశారు. కార్యకర్తలు, అభిమానులు వేషధారణలతో అలరించారు. మహానాడు వేడుకలతో కళల కాణాచి రాజమహేంద్రవరం పరిసరాలు సందడిగా మారాయి. పసుపు పారాణితో అలంకరించినట్లు ఎక్కడ చూసినా జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు శోభ తెచ్చాయి. అధినేత చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం తెలుగు జాతికి వెలుగు తెచ్చేలా సాగింది.
యువగళం : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దరహాసం
సేవకులు మూడు వేలు..
* మహానాడుకు తరలివచ్చినవారికి మూడు వేలమంది వాలంటీర్లు సేవలందించారు.
* చంద్ర దండు, ఐటీడీపీ, యువగళం, తెలుగుయువతకు సంబంధించి ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి వచ్చిన వాలంటీర్లు భోజనాలు, మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాహనాల నియంత్రణ వంటి సేవలందించారు.
* సభావేదిక వద్ద చంద్ర దండు వాలంటీర్లు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
* ఆదివారం బహిరంగ సభకు లక్షలాదిగా కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో మరింతమంది వాలంటీర్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విజయ పతాక: తెదేపా జెండా ఎగురవేస్తున్న చంద్రబాబు, చిత్రంలో అచ్చెన్నాయుడు
అభిమాన సంద్రం: తెదేపా శ్రేణుల హుషారు
దున్నేద్దాం: నాగలితో కార్యకర్త
వేదికపైకి వస్తున్న తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ నాయకుడు నర్సిరెడ్డితో గంటా శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముచ్చట్లు
తెలుగు మహిళలు: తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, గౌతు శిరీష తదితరులు
బతుకమ్మ.. దీవించమ్మా: తెలంగాణ నుంచి వచ్చిన కాట్రగడ్డ ప్రసూన, షకీలారెడ్డి
పలకరింపు: రామ్మోహన్‌నాయుడుతో అశోక్
కానుక: అధినేతకు బహూకరిస్తున్న కార్యకర్త
కుర్రోళ్లు: యువగళం పాటకు నృత్యం
ప్రాణదాత పుస్తకావిష్కరణలో అధినేతతో గోరంట్ల తదితరులు
మయూర మాలతో సత్కరించిన బుద్ధా వెంకన్న, కటకంశెట్టి ప్రభాకర్ తదితరులు
కేరింతలతో యువత జోష్
చంద్రన్న.. మళ్లీ నువ్వే రావాలన్నా.. సీడీ ఆవిష్కరణ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!